అక్కడ సైకిళ్లకు డిమాండ్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 19, 2019

అక్కడ సైకిళ్లకు డిమాండ్‌


కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో సైకిళ్లకు భారీ డిమాండ్‌ పెరిగింది. అధికారులు దృష్టి సారించడంతో ప్రముఖులు కూడా ఆసక్తి చూపుతున్నారు. రాచనగరి మైసూరు నగరం తరహాలో యాప్‌ ఆధారిత ‘అద్దె సైకిళ్లు’ సేవను అందుబాటులోకి తేనున్నారు. మైసూరు నగరానికి వచ్చే పర్యాటకుల కోసం ‘ట్రిణ్‌ ట్రిణ్‌’ పేరుతో అద్దె సైకిళ్ల పథకం ప్రవేశపెట్టారు. అదే తరహాలో బెంగళూరులో అద్దె సైకిళ్ల సేవలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

 పర్యాటక, ఉద్యానశాఖ సంయుక్తంగా 'నమ్మ నిమ్మ సెకిల్'’ పేరుతో అద్దెకు సైకిళ్లను ఇచ్చే ప్రక్రియను అమలులోకి తేనున్నారు. అమెరికా, యూరోప్‌ దేశాల్లో సైకిల్‌ పర్యాటకానికి చాలా డిమాండ్‌ ఉంది. అంతేకాకుండా ఆయా దేశాల్లో సైకిల్‌ వినియోగంతో పర్యటిస్తున్న కారణంగా పర్యావరణం పరిరక్షించడమే కాకుండా ఆదాయం కూడా బాగానే ఆర్జిస్తున్నారు. అదేరీతిలో బెంగళూరులో కూడా సైకిళ్ల సేవను ఏర్పాటు చేస్తే మంచి సత్ఫలితాలను సాధించవచ్చని ఉద్యాన శాఖ అధికారులు భావిస్తున్నారు. నగరంలోని కబ్బన్‌పార్కు చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల మేర సైకిల్‌ ద్వారా పర్యటించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad