ఎమ్మెల్యేగా నటిస్తూ.. నటిస్తూ.. ఎంపీ అయ్యాడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 19, 2019

ఎమ్మెల్యేగా నటిస్తూ.. నటిస్తూ.. ఎంపీ అయ్యాడు!


రాజకీయ నేతగా సినిమాల్లో అతడి నటనను చూసి… అతడు నిజ జీవితంలో కూడా రాజకీయ నేతగా చక్కగా సెట్ అవుతాడని రివ్యూయర్లు అనే వాళ్లు. వరస పెట్టి సినిమాల్లో అతడికి అలాంటి అవకాశాలు వస్తూ ఉండగా.. అదే గెటప్ లో అతడు వెళ్లి అసెంబ్లీలో కూర్చుంటే రాజకీయ నేతే అనుకుంటున్నారు తప్ప, నటుడు అని ఎవరూ అనుకోరని.. అంటూ అతడి నటనను ప్రశంసించారు రివ్యూయర్లు.

వారి మాటలే రవి కిషన్ కు కలిసి వచ్చినట్టుగా ఉన్నాయి. అతడు ఇప్పుడు ఎంపీగా లోక్ సభలో అడుగు పెట్టడమే అందుకు నిదర్శనం. రవి కిషన్ తెలుగు వారికి పరిచయిస్తుడే. పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు రవి కిషన్. తెలుగు సినిమాల ద్వారా మనకు పరిచయం కాక ముందు నుంచినే ఇతడికి ఉత్తరాదిన మంచి గుర్తింపు ఉంది.

ఇతడు భోజపురి సూపర్ స్టార్. అక్కడ ఇతడొక మెగాస్టార్. దేశంలలో అతి చిన్న సినీ పరిశ్రమలో భోజ్ పురి చిత్ర పరిశ్రమ ఒకటి. భోజ్ పురి అంటూ ప్రత్యేకమైన భాష ఏమీ లేదు. హిందీలోనే అదొక స్లాంగ్ లాంటిది. బిహార్,
యూపీల్లోని కొన్ని ప్రాంతాల్లో హిందీని భోజ్ పుర్ యాసలో పలుకుతారు. ఆ ప్రాంతాన్ని అంతా భోజ్ పురిగా పేర్కొంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా సినిమాలు కూడా రూపొందుతూ ఉంటాయి. హిందీలో, తెలుగులో హిట్టైన సినిమాల కథలను అక్కడ రీమేక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలో రవి కిషన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు.

ఆ గుర్తింపుతో ఇతర భాషల ఇండస్ట్రీలను ఆకర్షించారు. తెలుగు వాళ్లు అతడికి విలన్ వేషాలు ఇచ్చి ఆదరించారు. వాటికి న్యాయం చేశాడు రవి కిషన్. 'రేసుగుర్రం' సినిమాలో రవి కిషన్ మద్దాలి శివారెడ్డిగా ఆకట్టుకుంటాడు. అలాగే కల్యాణ్ రామ్ సినిమా 'ఎమ్మెల్యే'లో కూడా రాజకీయ నేత పాత్రనే చేశాడితను. రేసుగుర్రంలో మంత్రి కావాలని తపించే మద్దాలి శివారెడ్డి పాత్ర, ఎమ్మెల్యేలో ఎమ్మెల్యేగానే కనిపించడంతో..ఇతడికి రాజకీయ నేత వేషం వంద శాతం సూట్ అయ్యిందనే అభిప్రాయాలు వినిపించాయి.

అందుకు తగ్గట్టుగా ఇప్పుడు ఇతడు రాజకీయ నేత అయ్యాడు. బీజేపీ తరఫున గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా నెగ్గారు. ఎంపీగా లోక్ సభలో ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. రాజకీయ నేత పాత్రల్లో సినిమాల్లో రాణించి, నిజ జీవితంలోనూ ఆ హోదాను సంపాదించుకోవడం రవి కిషన్ ప్రత్యేకత అని చెప్పాలి!

No comments:

Post a Comment

Post Bottom Ad