వేస్ట్ బాటిల్స్ తో.. బెస్ట్ థింగ్స్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 20, 2019

వేస్ట్ బాటిల్స్ తో.. బెస్ట్ థింగ్స్!


ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో ఇంటి అలంకరణ ఆకట్టుకునేలా తయారు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కొత్త ట్రెండ్‌ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఎక్కువ నగదు వెచ్చించే పని లేకుండా ఇంట్లో వాడి పడేసిన నీళ్ల బాటిళ్లకు కొత్తరూపం అందించి అలంకరించడం ప్రధాన నగరాల్లో ట్రెండ్‌గా మారింది. ఇంట్లో  ఉన్న పాత బాటిళ్లకు దారం, జూట్‌ తో అందంగా అలంకరించి ఇళ్లలో అలంకరణ కోసం వినియోగిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇళ్లలో కనిపిస్తున్నాయి. జ్యూస్‌ లేదా ఆహార సామగ్రి కొనుగోలు చేసే సమయంలో లభించే పాత బాటిళ్లకు డిమాండ్‌ కూడా పెరిగింది.



తమ సృజనాత్మకత, ఆలోచనలకు అనుగుణంగా వివిధ అలంకరణ వస్తువులు వినియోగించి చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇంట్లో వివిధ స్ధలాల్లో వాటిని డిజైనర్‌గా, పెన్‌స్టాండ్, ల్యాంప్‌గా ఉపయోగిస్తున్నారు. అవసరమైన అలంకరణ వస్తువులుగా మార్చుకుని ఇంట్లో అల్మారాలో ఉంచి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంట్లో ఉన్న గాజు లేదా ప్లాస్టిక్‌ బాటిల్‌ కు మందమైన దారంతో చుట్టి దానికి గమ్‌ అతికించి తమకు ఇష్టమైన అలంకరణ వస్తువులుగా రూపం పోస్తున్నారు. మొదట మందమైన గాజు లేదా ప్లాస్టిక్‌ బాటిల్‌ తీసుకుని బాటిల్‌ పైబాగంలో గమ్‌ అతికించిన అనంతరం దారాన్ని బాటిల్‌ ఆకారానికి అనుగుణంగా మధ్య భాగం వరకు చుట్టుకుంటూ రావాలి.

బాటిల్‌ చివరి భాగానికి వచ్చే సరికి గమ్‌ తో బాటిల్‌ కు గట్టిగా అతికించి ఎండలో ఆరబెట్టాలి. తర్వాత ఇష్టమైన రీతిలో బాటిల్‌ తయారీ అవుతుంది. దీనిపై అలంకరణ పూలు, వస్త్రాల లేస్, పెన్నులు, వివిధ పూలు అలంకరణ వస్తువులతో సింగారించుకోవచ్చు. అలంకరణ వస్తువులు ఇష్టం లేకపోతే రంగులు ఉపయోగించి చిత్రాలు కూడా గీయవచ్చు. టైన్‌ దారానికి బదులు ఇతర రేష్మ అందంగా కనిపించే రంగురంగుల దారాలు వినియోగించవచ్చు. బాటిల్‌కు పూర్తిగా లైట్‌ కలర్‌ లేదా తెలుపు రంగు చుట్టి వాటి మద్య ఏదైనా అలంకరణ వస్తువులు అంటించి వాటిని పెన్‌స్టాండ్, ల్యాంప్‌లుగా వాడుకుంటున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad