అల్లు అర్జున్ సినిమా.. వైఎస్సార్సీపీ వ్యతిరేకా? అంత కోపమా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 20, 2019

అల్లు అర్జున్ సినిమా.. వైఎస్సార్సీపీ వ్యతిరేకా? అంత కోపమా!


టాలీవుడ్ లో ఇప్పటి వరకూ చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలు పెట్టారు. రాజకీయం చేశారు. కొందరు సక్సెస్ అయ్యారు. మరి కొందరు ఫెయిల్యూర్ అయ్యారు. అయితే ప్రేక్షకులు అయినా, సినిమా వాళ్లు అయినా.. రాజకీయాన్ని రాజకీయంలా చూశారు, సినిమాలను సినిమాల్లా చూశారు. సినిమాల్లో ఆదరించిన వారిని రాజకీయంగా ఆదరించలేదు, అలాగని రాజకీయం చేశారని ఏ సినిమా వాళ్లనూ ప్రేక్షకులు నిరాదరించలేదు.

రాజకీయంగా తమ నచ్చని నటుడి సినిమాలకు కూడా ప్రేక్షకులు వెళ్లారు, వెళ్తారు. ప్రేక్షకులకు ఆ పాటి మెచ్యూరిటీ ఉంది. తమకు కావాల్సింది మంచి సినిమా మాత్రమే అని ప్రేక్షకులు అనుకుంటారు.
అయితే టాలీవుడ్ లో హీరోలకు మాత్రం ఆ మాత్రం  సహనం లేకుండా పోతున్నట్టుగా ఉంది. అందుకు నిదర్శనమే అల్లు అర్జున్ తీరు అని అంటున్నారు పరిశీలకులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్ గా గట్టిగా తిరిగాడని ఒక నటుడి పై అల్లు అర్జున్ ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తన సినిమా నుంచి ఆ నటుడిని తొలగించాడట అల్లు అర్జున్.

హాస్య నటుడు పృథ్వీ విషయంలో ఇది జరిగిందనే టాక్ వినిపిస్తూ ఉంది. ఇటీవలి ఎన్నికల సమయంలో పృథ్వీ ఎంత హడావుడి చేశాడో అందరికీ తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా తిరిగారు ఆయన. జగన్ కు గట్టి సపోర్టర్ గా నిలిచాడు. తనతో పాటు కొంతమంది సినిమా వాళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పాడు పృథ్వీ. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేనల మీద కూడా ఆయన విమర్శలు చేశారు.

అవన్నీ రాజకీయ విమర్శలే. అలా అంటే చాలా కాలం నుంచి పృథ్వీ రాజకీయ కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. అయితే అతడు అందరి సినిమాల్లోనూ నటిస్తూ వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని చాలా సార్లు విమర్శించినా బాలకృష్ణ సినిమాల్లో కూడా పృథ్వీ నటించాడు. అయితే జనసేనను, పవన్ కల్యాణ్ ను విమర్శించాడని అల్లు అర్జున్ అతడిని తన సినిమా నుంచి తప్పించాడట. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందే
సినిమాలో పృథ్వీకి ముందుగా ఒక పాత్ర దక్కినా ఆ తర్వాత అల్లు అర్జున్ జోక్యం చేసుకుని అతడిని ఆ సినిమా నుంచి తప్పించాడట. అదంతా రాజకీయ పరమైన కోపంతోనే అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనా సినిమా వాళ్లకు అలాంటి తీరు సరి కాదు.

అల్లు అర్జున్ కు జనసేన అంటే ఎంత అభిమానం అయినా ఉండొచ్చు.మరి జనసేనతో రాజకీయంగా విబేధించే వాళ్లంతా  ఆ హీరో సినిమాలను పక్కన పెడితే అతడి పరిస్థితి ఏమిటి?

No comments:

Post a Comment

Post Bottom Ad