గుడివాడలో నానిని ఓడించగల సత్తా దేవినేనికి ఉందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 09, 2019

గుడివాడలో నానిని ఓడించగల సత్తా దేవినేనికి ఉందా?

ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలవగలిగిన అతి తక్కువ మందిలో కొడాలి నాని ఒకరు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఘనవిజయం సాధించిన నాని మరోమారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఎలాగైనా నానిని ఓడించాలని కంకణం కట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా తన కుమారుడు లోకేశ్ ను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావించినా ఓటమి భయంతో ఆ ఆలోచన మానుకున్నారు.

ఈ నేపథ్యంలో గుడివాడలో నానిని ఢీకొని గెలిచే దమ్ము ఎవరికీ లేకపోవడంతో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను చంద్రబాబు పోటీలోకి దించడం దాదాపు ఖాయమైంది. అయితే నాని ముందు అవినాష్ తేలిపోతాడని చెబుతున్నారు. నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గంతోపాటు అత్యంత బలంగా కాపు సామాజికవర్గం ఉంది. వీరి ఓట్లతోపాటు ఎస్సీలు, మైనారిటీల మొగ్గంతా నాని వైపే ఉంది.

మరోవైపు అవినాశ్ స్థానికుడు కాకపోవడం, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అనుభవం లేకపోవడం, టీడీపీపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి, వంగవీటి - దేవినేని కుటుంబాల పాత తగదాల నేపథ్యంలో కాపులెవరూ దేవినేనికి ఓటు వేసే అవకాశం లేకపోవడం వంటి కారణాలు అవినాశ్ కు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. ఇదే క్రమంలో ఇంకా జనసేన పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. జనసేన అభ్యర్థి ఖరారయితే పోటీ కొడాలి నాని, జనసేన పార్టీల మధ్యే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవినేని మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad