మెగా కుటుంబం.. నరేశ్ కు మద్దతివ్వడానికి అసలు కారణం ఇదేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 10, 2019

మెగా కుటుంబం.. నరేశ్ కు మద్దతివ్వడానికి అసలు కారణం ఇదేనా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈసారి రసవత్తర పోరు జరగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఆర్టిస్టులు శివాజీరాజా, నరేశ్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం 'మా' అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా మరోమారు పోటీ చేస్తుండగా, కొత్తగా నరేశ్ కూడా పోటీకి దిగాడు. అయితే.. ఈసారి విశేషమేమిటంటే.. మెగా కుటుంబం తమ మద్దతును శివాజీరాజాకు కాకుండా నరేశ్ కు ప్రకటించడమే.

స్వతహాగా 'మా'లాంటి ఎన్నికలకు దూరంగా ఉండే మెగా కుటుంబం తమ మద్దతును నరేశ్ కు అందించడంపై ఆసక్తికర కథనం వినిపిస్తోంది. నరేశ్ కు మద్దతు తెలుపుతూ మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడిన మాటలను పరిశీలిస్తే ఇది అర్థమవుతోంది. శివాజీరాజా అధ్యక్షుడిగా బాగానే చేసినప్పటికీ ఎవరు పడితే వారు 'మా'పై ఆరోపణలు చేశారని, ఇష్టమొచ్చినట్టు వారు చెలరేగిపోయినా 'మా' ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాగబాబు మండిపడ్డాడు. 'మా' సభ్యులపై బయట వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నా చూస్తూ ఊరకుండిపోయారని, ఆ విషయం తనకు బాధ కలిగించిందని చెప్పాడు.

దీన్నిబట్టి చూస్తే శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లాంటివారు తన తల్లిని, తన సోదరుడు పవన్ కల్యాణ్ ను దూషించినప్పుడు 'మా' నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించలేదనేది నాగబాబు ఆవేదనగా ఉంది. శివాజీరాజా, శ్రీకాంత్ తదితరులు తనకు మంచి స్నేహితులైనప్పటికీ తమ మద్దతు మాత్రం నరేశ్ కు మాత్రమే ఇస్తామని కుండబద్దలు కొట్టాడు. వాస్తవానికి.. నాగబాబు చెప్పింది నిజమే. శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లాంటి ముక్కూముఖం తెలియని వ్యక్తులు 'మా' సభ్యులపై దూషణలకు పాల్పడితే 'మా' ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad