మరోమారు రెచ్చిపోయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 10, 2019

మరోమారు రెచ్చిపోయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'కొత్త పలుకు' పేరిట వ్యాసాలు రాస్తుండే ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కూడా మరో వ్యాసం దంచేశారు. ఇందులో కూడా కొత్త అంశాలేమీ లేకుండా పాత చింతకాయ పచ్చడే దంచారు. వాస్తవానికి.. ఆయన వ్యాసాలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా, ఇతరులకు వ్యతిరేకంగా ఉంటాయి. చంద్రబాబుకు చిన్న ఆపద ఎదురైనా ముందు ఈయన బాధపడిపోతుంటాడు. ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అన్నట్టు చంద్రబాబు బాద రాధాకృష్ణ బాధలా విలవిల్లాడిపోతాడు.

ఈసారి వ్యాసంలో రాధాకృష్ణ ఓటర్ల డేటా చోరీ అంశాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో డేటా చోరీ జరిగితే తెలంగాణలో కేసు పెట్టడం ఏమిటో అర్థం కావడం లేదని, చంద్రబాబును ఇబ్బందులు పెట్టడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జట్టు కట్టారని రాసుకొచ్చారు. అదే ఆంధ్రా పోలీసులు తెలంగాణ ప్రభుత్వంపై కేసులు పెట్టి ఉంటే ఈపాటికి తెలంగాణ అంతా తమ రాష్ట్రంపై దాడి జరుగుతుందని ఏకమయ్యేవారని, ఆంధ్రావాళ్లు మాత్రం అలా చేయడం లేదని తన ఆక్రోశం వెళ్లగక్కారు. విజయసాయిరెడ్డి తన పత్రికకు కులం ఆపాదిస్తున్నారని, సాక్షి మీడియాలో విభాగాలవారీగా, శాఖలవారీగా ఏ కులం వాళ్లు ఎంతమంది ఉన్నారో లెక్కచెబితే తాను కూడా లెక్క తీస్తానని సవాళ్లు విసిరారు.

అంతేకాకుండా కేసీఆర్ ఆంద్రా ప్రజలపై అధికారం చెలాయించాలనుకుంటున్నారని కొత్త సూత్రీకరణ చేశారు. తెలంగాణ పోలీసులు కేసీఆర్ పై ఎక్కడ లేని రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని రాధాకృష్ణ చెబుతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లు సజ్జన్నార్, అంజనీకుమార్ లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అతి పనికిరాదని వారిని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రాజెక్టులో కమీషన్ పొందడంతోపాటు తన పత్రికకు, టీవీ చానెళ్లకు వందల కోట్ల రూపాయలు యాడ్స్ పొందిన రాధాకృష్ణ తన భక్తిని చంద్రబాబుపై బాగా చూపిస్తున్నాడని ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad