వైఎస్సార్సీపీ టీవీ-5ని బహిష్కరించడానికి కారణం ఇదేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 10, 2019

వైఎస్సార్సీపీ టీవీ-5ని బహిష్కరించడానికి కారణం ఇదేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా తన బహిష్కరణ మీడియా జాబితాలో టీవీ-5ని కూడా చేర్చింది. ఇప్పటికే ఆంధ్రజ్యోతిపై ఈ బహిష్కరణ కొనసాగుతుండగా టీవీ-5 కూడా ఇప్పుడు చేరింది. స్వతంత్ర మీడియా ముసుగులో తమకు గిట్టని వ్యక్తులు, పార్టీలపై టీవీ-5 విషం చిమ్ముతోందని వైఎస్సార్సీపీ చెబుతోంది. అందుకే ఆ మీడియాను తమ పార్టీ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు పిలవబోమని వెల్లడించింది. తమ పార్టీవారెవరూ కూడా టీవీ-5 నిర్వహించే చర్చలకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి.. ఆంధ్రప్రదేశ్ లో మీడియా వ్యభిచారం చేస్తోంది. ప్రధాన పత్రికలు, టీవీ చానెళ్లు తమ తమ సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులకు, పార్టీలకు వీర భజన చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టీవీ-5, టీవీ-9, ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, సీవీఆర్ న్యూస్ తదితరాలు మూటగట్టుకున్నంత వ్యతిరేకత మరే మీడియా పొందలేదు. ఇవన్నీ కమ్మ కులం చేతిలో ఉండటంతో తమ కులస్తుడే అయిన చంద్రబాబుకు బాకా ఊదడం, అదేక్రమంలో చంద్రబాబుకు వ్యతిరేకులైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలపై అవాస్తవాలు రాయడం, ప్రచురించడం, ఏ మాత్రం స్థాయి, హోదా లేనివారిని తీసుకొచ్చి రోజుల తరబడి, గంటల తరబడి చర్చలు పెట్టడం చేస్తున్నాయి.

ప్రజల సమస్యలు, రైతుల ఆక్రందనలు, వైద్యం అందక ఏజెన్సీ ఏరియాల్లో మోగుతున్న మరణ మృదంగం తదితరాలను గాలికొదిలేసి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ భజనలో సేదతీరుతున్నాయి. పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని అవాస్తవ కథనాలను వండివార్చి ఇప్పటికే రాష్ట్ర ప్రజల దృష్టిలో పలుచనైన ఈ చానెళ్లు, పత్రికలు ఇంకా తమ బుద్ధి మార్చుకోలేదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీ-5 పై వేటేసింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 

No comments:

Post a Comment

Post Bottom Ad