నిహారికతో ఉన్న ఈ ముసుగు మనిషి ఎవరో.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 10, 2019

నిహారికతో ఉన్న ఈ ముసుగు మనిషి ఎవరో..

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల మంచి ప్రతిభావంతురాలన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ముద్దపప్పు-ఆవకాయ్',  'నాన్నకూచి' వెబ్ సిరీస్ లతో, ఈటీవీ యాంకర్ గా, సినీ హీరోయిన్ గా తన ప్రతిభను నిరూపించుకుంది. ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు (ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్) చేసిన ఈ ముద్దుగుమ్మకు విజయం మాత్రం దక్కలేదు. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి చేసిన చిత్రం మాత్రమే విజయం సాధించింది.

ప్రస్తుతం నిహారిక 'సూర్యకాంతం' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల చివరలో విడుదల అవుతోంది. ఇదేకాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న 'సైరా'లోనూ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కాపాడే పాత్రలో నిహారిక నటిస్తుందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

ఇదిలా ఉండగా ఈ భామ.. సోషల్ మీడియాలో ఒక ఫన్నీ ఫొటోను షేర్ చేసింది. కొవ్వొత్తి వెలుగులో నిహారిక, పక్కన ముఖం, ముక్కుపైవరకు ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఫొటోలో ఉన్నారు. ఈ ముసుగు ధరించిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టండి చూద్దామంటూ తన అభిమానులకు పజిల్ ఇచ్చింది.. నిహారిక. ఆ మాత్రం తెలియదా.. అతను సాయిధరమ్ తేజ్ అంటూ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా మీ ఇద్దరి జంట బాగుంటుందని, పెళ్లి చేసుకోవాలంటూ కోరడం విశేషం. 

No comments:

Post a Comment

Post Bottom Ad