అలీ రాకతో వెలంపల్లికి సీటు గోవిందానేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, March 11, 2019

అలీ రాకతో వెలంపల్లికి సీటు గోవిందానేనా?

సినీ నటుడు అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అలీ గుంటూరు తూర్పు లేదా రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన కన్ను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్ కు సీటు హుళక్కేనని సమాచారం.

2009లో విజయవాడ పశ్చిమ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘనవిజయం సాధించారు. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జలీల్ ఖాన్ పై ఓడిపోయారు. తర్వాత జలీల్ ఖాన్ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడంతో వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయడానికి వెలంపల్లి సిద్ధమవుతున్న క్రమంలో అలీ వైఎస్సార్సీపీలో చేరడంతో వెలంపల్లి గొంతులో పచ్చివెలక్కాయ పడింది. అలీ కోరుకుంటే ఆయనకు విజయవాడ పశ్చిమ సీటు కేటాయించే అవకాశం ఉండటంతో వెలంపల్లి శ్రీనివాస్.. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad