తొలి విడతలోనే ఎన్నికలు జరగడం వెనుక మోడీ కుట్ర ఉందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, March 11, 2019

తొలి విడతలోనే ఎన్నికలు జరగడం వెనుక మోడీ కుట్ర ఉందా?

ఆంధ్రప్రదేశ్ లో తొలి విడతలోనే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర ఉందని అధికార తెలుగుదేశం పార్టీ భావిస్తోందా.. అంటే ఆ పార్టీ నేతల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు సైతం ఒకేసారి జరపాలని ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటూ గతంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరుగా ఎన్నికల సంఘాన్ని కోరారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోదీని సైతం కలిసి ఈ దిశగా ఒత్తిడి తెచ్చారని, దీంతో ప్రధాని మోదీ ఆదేశించడంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువడిన నెలలోపుగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిందని చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండటంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండటం, ఇతర్రతా ఓటర్లను కొనుగోలు చేయడం, బెదిరించడం, ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేసే  అవకాశం ఉండటంతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష పార్టీ అంటోంది.

తమను ఓడించడం కోసమే కేసీఆర్, మోదీ, జగన్ ఇలా చేశారని టీడీపీ ప్రచారం చేయాలనుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ ఆ ముగ్గురు నేతలపై ఒంటి కాలితో లేస్తోంది. ఇప్పుడు విడుదలైన ఎన్నికల షెడ్యూల్ పై కూడా విమర్శలు చేసి జగన్, కేసీఆర్.. మోదీకి మద్దతు పలకడం వల్లే ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఒకే విడతలో ఎన్నికలు జరిగేలా చేశారని చెబుతోంది. ఈ అంశంపైనే రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఉధృతం చేయనుంది. తద్వారా తెలంగాణలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టి కేసీఆర్ లాభపొందినట్టు ఇక్కడ టీడీపీ కూడా లాభపడాలని భావిస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad