ముస్లింల ఓట్లు వైఎస్సార్సీపీకేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, March 11, 2019

ముస్లింల ఓట్లు వైఎస్సార్సీపీకేనా?

వచ్చే శాసససభ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు ఏ పార్టీకి పడతాయి అనే దానిపై విశ్లేషణలు మొదలైపోయాయి. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తానని తేల్చిచెప్పారు. అదేవిధంగా ప్రముఖ సినీ నటుడు అలీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ముస్లింల ఓట్లు ఆ పార్టీకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి పలు కారణాలను చెబుతున్నారు.

గత ఐదేళ్లలో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం, నాలుగున్నరేళ్లకుపైగా ఆ ముస్లింల్లో ఎవరికి మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం వంటివి టీడీపీకి నష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గరపడ్డ చివరి మూడు నెలల్లో ఏదో కంటితుడుపు చర్యగా కర్నూలు జిల్లా టీడీపీ ముస్లిం నేత ఫరూక్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు వాడుకుని వదిలేసే నైజాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు.

మరోవైపు ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఆ వర్గాన్ని ఆకట్టుకున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ తమకు విద్య, ఉద్యోగావకాశాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని, ఆయన నైజాన్నే పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ తమకు మరింత మేలు చేస్తారని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి తమ ఓట్లని చెబుతున్నారు. తమ మేలు కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టలేదని మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad