నారా లోకేశ్ కు డిపాజిట్ కూడా రాదు: వైఎస్సార్సీపీ ఎంపీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 09, 2019

నారా లోకేశ్ కు డిపాజిట్ కూడా రాదు: వైఎస్సార్సీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన పోటీ చేయడానికి గుడివాడ, హిందూపురం, కుప్పం, పెనమలూరు, చంద్రగిరి వంటి నియోజకవర్గాలను పరిశీలించినా అక్కడ ఓడిపోయే అవకాశం ఉండటంతో చివరకు విశాఖపట్నం జిల్లాలోని భీమిలిని ఎంపిక చేసుకున్నారు.

అయితే.. భీమిలి నుంచి పోటీ చేస్తే లోకేశ్ కు డిపాజిట్ కూడా రాదంటున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. లోకేశ్ ను కుప్పం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరినా లోకేశ్ మాత్రం భీమిలి నుంచే పోటీ చేస్తానని పట్టుబడుతున్నాడని చంద్రబాబు కులపత్రిక (ఆంధ్రజ్యోతి) పరవశంతో రాస్తోందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. కుప్పం నుంచి పోటీ చేయడానికి చంద్రబాబే భయపడుతున్నారని, లోకే్శ్ కు భీమిలి నుంచి డిపాజిట్ కూడా రాదని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆ స్థాయిలో ప్రజాగ్రహం ఉండటమే దీనికి కారణమని అంటున్నారు.

విజయసాయిరెడ్డి చెప్పేదానిలో వాస్తవం ఉందని పేర్కొంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. కుప్పం నుంచి చంద్రబాబు గెలుపుకు ఎలాంటి ఢోకా లేకపోయినప్పటికీ భీమిలిలో మాత్రం లోకేశ్ కు డిపాజిట్ కూడా రాదనే మాట వాస్తవమేనంటున్నారు. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర అసంతృప్తి, విశాఖ జిల్లాలో అత్యంత బలంగా జనసేన పార్టీ ఉండటం, స్వయంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండటం, ఈ ప్రభావం ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాలపై ఉండే అవకాశం ఉండటంతో లోకేశ్ కు డిపాజిట్ కష్టమేనని తెలుస్తోంది.


No comments:

Post a Comment

Post Bottom Ad