కౌశల్ ప్రచారం చేస్తే టీడీపీకి ఓట్లు రాలతాయా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 09, 2019

కౌశల్ ప్రచారం చేస్తే టీడీపీకి ఓట్లు రాలతాయా?

మాటీవీలో ప్రసారమైన బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి కౌశల్ తెలుగునాట మంచి క్రేజ్ సాధించాడు. కౌశల్ ఆర్మీ పేరిట ఆయన అభిమానులు కౌశల్ గెలుపుకు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా కౌశల్ ఆర్మీనే కౌశల్ మీద ఎదురుదాడికి దిగడం గమనార్హం. కౌశల్ చాలా స్వార్థపరుడని, కౌశల్ ఆర్మీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇలా పలు సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కౌశల్ కూడా వివరణ ఇచ్చాడు.

కాగా, తాజాగా కౌశల్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తాడని లేదంటే టీడీపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే.. కౌశల్ ప్రచారం చేసినా, పోటీ చేసినా టీడీపీ ఓటమిని ఆపలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాజకీయాలు, సినిమాలు వేర్వేరని, సినిమాల్లో ఉద్దుండులైన వారినే ప్రజలు ఓడించారని, అలాంటిది కౌశల్ ఒక లెక్క కూడా కాదని అంటున్నారు. ఒక వైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అత్యంత బలంగా ఉన్నాయని, ఆ పార్టీలను ఢీకొని కౌశల్ తో ప్రచారం చేయించడం వల్ల టీడీపీకి ఎలాంటి లాభం చేకూరదని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కౌశల్ ఆర్మీ చేస్తున్న ఆరోపణలతో కౌశల్ క్రేజ్ మసకబారిందని గుర్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad