బీచ్ ఒడ్డున దుమ్మురేపిన హాట్ భామ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 09, 2019

బీచ్ ఒడ్డున దుమ్మురేపిన హాట్ భామ

అప్పుడెప్పుడో తెలుగులో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'కాంచనమాల కేబుల్ టీవీ'లో హీరోయిన్ గా పరిచయమైంది.. హాట్ భామ లక్ష్మీ రాయ్. ఆ సినిమాలో అందాల ప్రదర్శన చేసినా సినిమా విజయవంతం కాకపోవడంతో తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళం, మలయాళం సినిమాలకే పరిమితమై పోయింది.. ఈ ముద్దుగుమ్మ.  పేరు కలిసిరావడం లేదని లక్ష్మీ రాయ్ గా ఉన్న తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది.

తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన 'బలుపు', మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఖైదీ నెంబర్ 150', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాల్లో ఐటెమ్ సాంగుల్లో ఈ భామ విరగదీసింది. ప్రస్తుతం తెలుగులో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' మూవీలో నటిస్తూ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

నిర్మాతలను, దర్శకులను ఆకట్టుకుని మరిన్ని అవకాశాలు పొందడానికి హాట్ హాట్ ఫొటో షూట్ లతో దుమ్ములేపుతోంది. తన అంగాంగాలను యధేచ్ఛగా ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. తాజాగా టూ పీస్ బికినీ ధరించి బీచ్ ఒడ్డున దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానుల గుండెలను గాయబ్ చేసింది. ఈ ఫొటోను చూసిన అభిమానులు 'రత్తాలు.. రత్తాలు.. ఓసోసి రత్తాలు' అంటూ పాడుకోకుండా ఉండలేకపోతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad