పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 09, 2019

పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. వాసు. అల్లు అర్జున్ ముద్దు పేరు బన్నీని కలుపుకుని బన్నీ వాసుగా సినీ ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. నేచురల్ స్టార్ నానితో 'భలే భలే మగాడివోయ్', అక్కినేని నాగచైతన్యతో '100 పర్సంట్ లవ్', మెగా హీరో శిరీష్ తో 'శ్రీరస్తు శుభమస్తు', విజయ్ దేవరకొండతో 'గీతగోవిందం' వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాలు సాధించాడు. బడా నిర్మాత అల్లు అరవింద్ కు నమ్మినబంటుగా, ఆ కుటుంబ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.. బన్నీ వాసు.

తాజాగా బన్నీ వాసు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. పవన్ ఆమోదం లభిస్తే దాదాపు బన్నీ వాసు అక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. పైగా మెగా బ్రదర్ నాగబాబు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులు వాసుకు ఉన్నాయి.

మార్చి 14న రాజమండ్రిలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నియమించిన కమిటీలో బన్నీ వాసు కూడా స్థానం దక్కించుకున్నాడు. పాలకొల్లులో వాసుకున్న విశేష అనుచరగణం, అంగ, అర్ధ బలాలు ఆయనకు ఉపకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాలకొల్లు నుంచి బన్నీవాసు పోటీకి పవన్ అడ్డుచెప్పకపోవచ్చు. 

No comments:

Post a Comment

Post Bottom Ad