కడుపు మండి పార్టీ పెట్టా: పవన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 28, 2014

కడుపు మండి పార్టీ పెట్టా: పవన్

pawan speech at visag meeting comments on congress

విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జనసేన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏకిపారేశారు. కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించేయాలంటూ పెద్ద ఎత్తున హాజరైన యువతకు, అభిమానులకు మరోసారి పిలుపునిచ్చారు. వారిని ఉద్దేశించి పవన్ దాదాపు 75 నిమిషాల పాటు ప్రసంగించారు. కాంగ్రెస్‌ నేతలను తూర్పారా పట్టారు. బొత్స, కావూరి వంటి కాంగ్రెస్‌ నేతలు కాంట్రాక్టులు, వ్యాపారాల కోసం ఏమైనా చేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో సోనియాగాంధీ పక్షపాతంతో వ్యవహరించారన్నారు. పిల్లల్లాంటి తెలంగాణ, సీమాంధ్రలో ఒక ప్రాంతాన్ని ముద్దాడి.. మరో ప్రాంతాన్ని చీదరించుకున్న సోనియా తల్లి ఎలా అవుతుంది? తెలంగాణ ప్రజలు ఆమెను తల్లిగా భావిస్తున్నా అలాంటి లక్షణాలు ఆమెలో లేవని తేల్చేశారు. సోనియా తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ ఇలాంటి రాజకీయ వికృత క్రీడ ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని విభజించి రోమన్ చక్రవర్తులు బానిసలకు ఎంగిలి మెతుకులు విసిరినట్టు మనకు ప్యాకేజీల విసిరారని చెప్పారు. ఇంట్లో పళ్లు నూరి కూర్చోకుండా అందుకే కడుపు మండి జనసేన పార్టీ స్థాపించానని స్పష్టం చేశారు. ఓట్లు, నోట్లు, అధికారం కోసం రాలేదని అన్నారు.



మరిన్ని వార్తలు:
అభ్యర్థులను గుర్తించాం, కానీ..: పవన్
'ఇజం' పుస్తకమే మేనిఫెస్టో: పవన్
నమోయే సమర్థ నాయకుడు: పవన్
జాతీయ జెండాకు ఉన్నంత పవర్ ఉంది: పవన్
ఖద్దరు వస్త్రాలు దొరకలేదు: పవన్
'పవన్‌ తప్పు చేసినా వాడి తలకాయ తీయాలి'


No comments:

Post a Comment

Post Bottom Ad