అభ్యర్థులను గుర్తించాం, కానీ..: పవన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 28, 2014

అభ్యర్థులను గుర్తించాం, కానీ..: పవన్


pawan-speech-at-visag-meeting-not-contest-in-elections
వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విశాఖపట్నం బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లు చీల్చడం.. అభ్యర్థుల విజయావకాలను దెబ్బ తీయడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి 28 లోక్‌సభ, 96 శాసనసభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తించామని, ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నామని చెప్పారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడే మంచి వ్యక్తులు దొరికే వరకు జనసేన ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. నిస్వార్థంగా సేవ చేసే లక్షణాలున్న యువకులు ఈ సభకు హాజరైన వారిలో ఎందరో కనపడుతున్నారని, రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం చిత్తశుద్ధితో పనిచేసే యువ నాయకులు లభించేంత వరకూ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీమాంధ్రకు సమగ్రమైన కొత్త రాష్ట్ర రాజధాని నిర్మించే విషయమై మీకు ఎవరిపై నమ్మకం ఉంటే వారికే ఓట్లేయండని యువతకు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad