అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తిదాయకమైన సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో నేతల మధ్యన సంభాషణలు ఆసక్తిదాయకంగా మారాయి. అందులో భాగంగా తొలి రోజు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తిదాయకమైన సన్నివేశాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఆ క్రమంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మంత్రి పేర్నినాని ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. సన్నిహితంగానే రవిని ఉద్ధేశించి పేర్నినాని హాట్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
అసెంబ్లీ లాబీలో గొట్టిపాటి రవి అటుగా వెళ్తూ ఉండగా, పేర్నినాని ఆయనను అడ్డగించి మరీ మాట్లాడారని సమాచారం. సభ సమావేశాలు ప్రారంభం అయిన తొలి రోజు కావడంతో గొట్టిపాటి రవి పచ్చ చొక్కా వేసుకుని వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పూర్తి పచ్చపార్టీనేతగా ఈయన పసుపు చొక్కా వేసుకుని వచ్చారు.
గొట్టిపాటి రవి నేపథ్యం ఏమిటో చెప్పనక్కర్లేదు. ఆయన గత ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గారు. అనంతరం ఆయన ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలోనే మిగిలిపోయారు. ఈ సారి పార్టీ తరఫున నెగ్గి ఎమ్మెల్యేగా వచ్చారు. అయితే ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. గతంలో ఫిరాయించకపోయి ఉంటే ఇప్పుడు గొట్టిపాటి రవికి మంచి ప్రాధాన్యత దక్కేది.
ఆ ఉద్దేశాన్నే పేర్నినాని వ్యక్తం చేశారు. 'ఏంటయ్యా.. ఇది.. పచ్చ చొక్కా..' అంటూ గొట్టిపాటితో వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు ఏం సమాధానం ఇవ్వకుండానే రవి అక్కడ నుంచి వెళ్లిపోయారు!
No comments:
Post a Comment