సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో రూపొందుతున్న 'సాహో' సినిమా టీజర్ తాజాగా విడుదల అయ్యింది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆ హై నెస్ ను టీజర్ లోనే ప్రతిబింబించింది. ఈ యాక్షన్ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోందనే భరోసాను ఇస్తోంది ఈ సినిమా టీజర్.
టీజర్లో ఒకవైపు యాక్షన్ ఎపిసోడ్స్ ను హైలెట్ చేస్తూ మరో వైపు హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆమెతో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ను చూపించారు.
ఇక బీజీఎం కూడా స్టైలిష్ గా, మేకింగ్ కు అనుగుణంగా ఆకట్టుకునేలా ఉంది టీజర్లో. టీజర్ విడుదల సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఆగస్టు పదిహేనున ఈ సినిమా విడుదల కాబోతున్న విషయాన్ని ప్రకటించారు.
No comments:
Post a Comment