'సోగ్గాడే చిన్ని నాయన' వంటి సబ్జెక్ట్ కమర్షియల్ గా హిట్ కావడం నాగార్జునను ఇలాంటి సినిమాను చేయనిచ్చినట్టుంది. పక్కా అడాల్ట్ డైలాగులతో, హీరోని కాస్త ప్లేబాయ్ టచ్ తో చూపిస్తోంది 'మన్మథుడు -2' .పదిహేడేళ్ల కింద మన్మథుడుగా కనిపించిన నాగార్జున ఇప్పుడు లేడు వయసులో మన్మథుడు 2 గా కనిపిస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పలువురు హీరోయిన్లు నటించారు. వారెవరినీ టీజర్లో తెర మీద చూపలేదు కానీ, సినిమాకు సంబంధించిన అడాల్ట్ డైలాగులను మాత్రం టీజర్లోనే వినిపించేశారు,.
ఇలాంటివి మరిన్ని ఉంటాయి రెడీగా ఉండటన్నట్టుగా కట్ చేశారు టీజర్ ను. నాగార్జున ప్లేబాయ్ తరహా పాత్రను చేసినట్టుగా ఉన్నాడు.అయితే లేటు వయసు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినట్టుగా ఉంది. ఆగస్టు తొమ్మిదో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
No comments:
Post a Comment