తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏ మాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. తమ పార్టీలోకి రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరైనా టీడీపీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతానికి ఫిరాయింపులు లేనట్లే అని అంతా అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం మరో రకంగా అనుకుంటున్నారట. ఫిరాయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి కూడా రెడీ అవుతున్నారట.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయక తప్పదని జగన్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. ఆ మేరకు కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సైతం రెడీ అంటున్నారట.
తమకు మళ్లీ అవకాశం ఇవ్వడానికి జగన్ మోహన్ రెడ్డి ఓకే చెబితే, తమకు కాకపోయినా తమ కుటుంబీకులకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేస్తే.. తాము తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రెడీ అని ఆ నేతలు అంటున్నారని సమాచారం.
అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తొందరపడదలుచుకోలేదని.. మరి కొన్ని రోజులు పోయాకా ఆచితూచి స్పందించనున్నారని సమాచారం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరేందుకు సై అంటున్నారట. వారి సంఖ్య పది మంది వరకూ ఉందని టాక్!
No comments:
Post a Comment