దేశంలో విమానాశ్రయాల్లో ఎలాంటి చెకింగ్ లేకుండా కొంతమందిని మాత్రమే అలో చేస్తారు. కొంతమందికి మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. ప్రధానమంత్రి, రాష్ట్ర పతి.. అతి ముఖ్యమైన మరి కొందరికి ఈ అవకాశాలుంటాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎలాంటి చెకింగ్స్ లేకుండా విమానాల్లో ప్రయాణించగలరు.
ఇన్ని రోజులూ చంద్రబాబు నాయుడు కూడా అలానే విమానాశ్రయాల్లోకి వెళ్లి వస్తూ వచ్చారు. స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగడానికి చంద్రబాబు నాయుడు అలాంటి తనిఖీలు లేకుండానే ప్రయాణాలు చేశారు. ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు. దీంతో గత మినహాయింపులు రద్దు అయినట్టే. ప్రతిపక్ష నేతలను విమానాశ్రాయాల్లో తనిఖీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ను తనిఖీ చేశారు.
అయితే ఈ విషయంలో చంద్రబాబు వీరాభిమానులు, ఆయన అనుకూల మీడియా ఆక్రోశిస్తోంది. చంద్రబాబునే తనిఖీ చేయడమా.. అంటూ వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. విమానాశ్రయాల్లో అలా తనిఖీ చేయడం చంద్రబాబును అవమానించడమే అంటూ వారు చెప్పుకొస్తున్నారు.
అయితే ప్రతిపక్ష పార్టీల వాళ్లకు అలాంటి మినహాయింపు ఉండదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమాన ప్రయాణాలు చేసినప్పుడు విమానాశ్రయాల్లో ఆయనను తప్పనిసరిగా తనిఖీ చేస్తూ వచ్చారు. అప్పుడంతా ఎవరూ మాట్లాడలేదు.అంతే కాదు.. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మీద దాడి కూడా జరిగింది. అయితే అప్పుడూ ఎవరూ మాట్లాడలేదు. అయితే చంద్రబాబు విషయంలో మాత్రం అసంబద్ధమైన వార్తలను చూపిస్తున్నారు. ప్రజల చేత తిరస్కరించబడిన చంద్రబాబును అన్నింటికీ అతీతుడుగా చూపే ప్రయత్నం సాగుతున్నట్టుగా ఉంది!
No comments:
Post a Comment