తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ఒక సినిమాలో నటించిన తనూశ్రీ దత్తా కొన్నాళ్ల కిందట సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగులో ఉండగా తను లైంగిక వేధింపులకు గురి అయినట్టుగా తనూశ్రీ ఆరోపించింది. మొదట తనను వేధించిన నటుడి పేరు చెప్పకుండా ఆరోపణలు మాత్రమే చేసిన ఈ నటీమణి , ఆ తర్వాత అతడి పేరును కూడా చెప్పింది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ తనను వేధించాడని తనూశ్రీ వివరించింది. సినిమా షూటింగులో కొనసాగుతున్న సమయంలోనే నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారి ఆమె వివరించింది. ఆ సినిమా పేరు కూడా చెప్పింది. పదేళ్ల కిందట ఆ సంఘటన చోటు చేసుకున్నట్టుగా వివరించింది.
తనూశ్రీ ఆ ఆరోపణ చేయడంతో ఇండియాటు 'మీ టు' ఉద్యమానికి ఊపు వచ్చింది. ఇండియాలో అలాంటి వ్యవహారాలు బయటకు రావంటూ వ్యాఖ్యానించి తనూశ్రీ అందరినీ రెచ్చగొట్టింది. దీంతో అనేక మంది స్పందించారు. బాలీవుడ్ హీరోయిన్లు, ఇంకా అనేక మంది తాము లైంగిక వేధింపులను ఎదుర్కొన్నవైనాల గురించి వివరిస్తూ వచ్చారు. అలా తనూశ్రీ దేశంలో మీ టు ఉద్యమానికి ఊపునిచ్చింది.
అందుకు సంబంధించి అనేక పరిణామాలు సంభవించాయి కూడా. అయితే తనూశ్రీ చేసిన ఆరోపణలకు మాత్రం ఫలితం దక్కలేదు. ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు తేల్చారు. నాటా పటేకర్ ఆమెను వేధించినట్టుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ఆ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా వారు వివరించారు.
ఈ అంశంపై తనూశ్రీ స్పందించింది. సాక్షులను బెదిరించారని ఆమె అంటోంది. ఇక ఈ విషయంలో దేవుడే తీర్పును ఇస్తాడని .. తనూశ్రీ వ్యాఖ్యానించింది. నానా పటేకర్ ను దేవుడే చూసుకుంటాని అంటోంది ఈ నటీమణి.
No comments:
Post a Comment