తన వ్యక్తిగత స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ అనే ఒక వ్యవస్థనే చంద్రబాబు నాయుడు బలి పెడుతూ ఉన్నాడనే మాట వినిపిస్తూ ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకున్న అధికారాలతో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యంచ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి నేతలను భారతీయ జనతా పార్టీలోకి పంపి చేజేతురాలా ఆ పార్టీని చంద్రబాబు నాయుడే దెబ్బ తీయబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇప్పటికే పలువురు తెలుగుదేశం నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అధికారం చేజారగానే చాలా మంది కమలం పార్టీ వైపు చూస్తున్నారు. ఎలాగూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో వారికి చోటు దొరకదు. ఈ నేపథ్యంలో వారి చూపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద పడిందని, వారంతా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి.
ఈ విషయంలో ఓడిపోయిన తెలుగుదేశం నేతలతో మొదలు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ నేతలు, చంద్రబాబు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ అనే ట్యాగ్ ఉన్న నేతల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్లంతా తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి చేరబోతున్నారని తెలుస్తోంది.
మరి వీరు వ్యక్తిగత స్వార్థం కొద్దీ బీజేపీలోకి వెళ్లున్నారు..అనేది ఒక వాదన అయితే, చంద్రబాబు నాయుడే వీరిని బీజేపీలోకి పంపిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడుకు కేసుల భయం చాలానే ఉందని అంటున్నారు.
గత ఐదేళ్ల అవినీతి వ్యవహారాలపై కేసులు, అరెస్టులు ఉండవచ్చనే ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలు ఈ విషయంలో గట్టిగా కసరత్తు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో తమకు వ్యతిరేక ప్రభుత్వాలే ఉంటే కష్టం అని, బీజేపీలోకి కొంతమంది నేతలను పంపిస్తే అవసరమైన సందర్బాల్లో వారు లాబీయింగులు చేసి తనను రక్షించే అవకాశం ఉందని బాబు అనుకుంటున్నారట. అందుకే
ఆయన వ్యూహాత్మకంగా తన పార్టీ నేతలను బీజేపీలోకి పంపుతున్నారని భోగట్టా.
మరి ఇలా పంపడం వల్ల తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోతుంది. అయితే చంద్రబాబుకు ఇప్పుడు కావాల్సింది పార్టీ కాదు అని, ఆయన ఎంత సేపూ తనను తాను రక్షించుకునేందుకే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని, పార్టీ ఏమైపోయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా చర్చ సాగుతూ ఉందట!
No comments:
Post a Comment