తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యూటర్న్ లు తీసుకోవడంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. అలా యూటర్న్ లు తీసుకోవడంలో చాలా వేగంగా వెళ్లి బాబు రాజకీయంగా బొక్కబోర్లా పడుతూ ఉంటారు కూడా. ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు ఎన్నో అంశాల గురించి యూటర్న్ లు తీసుకున్నారు. ఆ తీరును ఆయన కొనసాగిస్తున్నట్టుగానే ఉన్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు తాజా యూటర్న్ ను ప్రశాంత్ కిషోర్ విషయంలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
గత కొంతకాలంగా ఆ పొలిటికల్ స్ట్రాటజిస్టును చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఉన్నారనే నెపంతో చంద్రబాబు నాయుడు ఆయనను తీవ్రంగా విమర్శించారు. అది కూడా తీవ్రమైన మాటలతో!
ప్రశాంత్ కిషోర్ ఒక దొంగ అని, ఆయన బిహార్ గజదొంగ అని చంద్రబాబు నాయుడు నిందించాడు. ఆయన కుల రాజకీయం చేస్తున్నారని, జగన్ కు చేత కాక పీకేని నమ్ముకున్నారని.. ఇలా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన పార్టీ వాళ్లు తీవ్రంగా విమర్శించారు. పీకేని 'బిహారీ గజదొంగ' అని టీడీపీ వాళ్లు విమర్శించడంతో ఆ అంశంపై దుమారం రేగింది. చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రాన్నే అవమానిస్తూ ఉన్నాడని అనేక మంది ధ్వజమెత్తారు. ఆ అంశంపై ప్రశాంత్ కిషోర్ కూడా ట్విటర్ ద్వారా రియాక్ట్ అయ్యాడు.
మరి అంత చేసి.. ఇప్పుడు పీకేతో, ఐ ప్యాక్ తో చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడు, పీకేని చంద్రబాబు నాయుడు తన రాజకీయ సలహాదారుగా నియమించుకోబోతున్నాడనే వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇది నిజంగా నిజమేనా అనేది అనుమానమే.
ఎందుకంటే.. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయినా కూడా పీకేతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఐ ప్యాక్ ల మధ్య ఒప్పందం కొనసాగుతూ ఉందని. .భవిష్యత్తులో కూడా అది సాగుతుందని వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో పీకేని చంద్రబాబు కోసం జగన్ వదిలే అవకాశాలు కూడా లేవనే మాటా వినిపిస్తోంది!
No comments:
Post a Comment