ఏపీ అసెంబ్లీ సమావేశాలు అలా మొదలయ్యాయో లేదో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్యన రచ్చ రాజుకుంది. అసెంబ్లీలో ఇరు వర్గాల మధ్యన వాదోపవాదాలు సాగాయి. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టింది. ఎదురుదాడి చేయబోయి తెలుగుదేశం పార్టీ భంగ పడింది.
ఫిరాయింపుల అంశంలో చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించి ఆయనను ఇరకాటంలో పడేసింది. చంద్రబాబు నాయుడు ఏదో చెప్పపోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా రిటార్డ్ ఇచ్చింది.
ఇక అచ్చెన్నాయుడు కూడా ఏదో సానుభూతి పొందే ప్రయత్నం చేయగా.. ఆయనకూ వైఎస్సార్సీపీ కౌంటర్ ఇచ్చింది. ఆ అసెంబ్లీలో ఫిరాయింపుల అంశం కూడా చర్చకు వచ్చింది. తాము గేట్లు తెరిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రకటించారు. అయితే తమ వైపుకు ఎవరు రావాలన్నా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు ఎవరు ఫిరాయించినా వారిపై అనర్హత వేటు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ చర్చ సాగుతూ ఉండగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీలోకి రావడానికి ఎనిమిది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని ఆయన ప్రకటించారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు తనతోనే టచ్లో ఉన్నారని.. వారు రావడానికి రెడీ అంటున్నారని, అయితే వారి చేత రాజీనామా చేయించే తాము తీసుకునే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఈ నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రకటించారు.
ఎవరినీ ఫిరాయింపజేసే ఉద్దేశం లేదని, ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసే రావాల్సి ఉంటుందని ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫిక్సై ఉన్నారని ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో తెలుగుదేశం పార్టీలో కలకలం పుట్టిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
No comments:
Post a Comment