ఓట్లకే కాకుండా మన బ్యాంకు ఖాతాలకు కూడా ముప్పుపొంచి ఉందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, March 06, 2019

ఓట్లకే కాకుండా మన బ్యాంకు ఖాతాలకు కూడా ముప్పుపొంచి ఉందా?

ఓట్లకే కాకుండా మన బ్యాంకు ఖాతాలకు కూడా ముప్పుపొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు.. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరి వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించిందని వారు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారి ఓట్లను తొలగించడంతోపాటు బ్యాంకు ఖాతాల్లో డబ్బును కూడా మాయం చేస్తారని చెబుతున్నారు.

ఇప్పటికే ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లను తొలగించాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేమని గ్రహించిన చంద్రబాబు సర్కార్.. వ్యూహాత్మకంగా వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్లను తెలుసుకుని వాటిని తొలగిస్తోంది. ఆన్లైన్ లో కూడా ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షల్లో అర్హుల ఓట్లను తొలగించారు.

ఒక్క గుంటూరు జిల్లాలోనే ఓట్లను తొలగించాలని లక్షకు పైగా దరఖాస్తులు అందడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను హెచ్చరించారు. ప్రజలంతా వెంటనే ఏటీఎం, క్రెడిట్ కార్డుల పిన్ నెంబర్లు మార్చుకోవాలని, బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును బాబూకొడుకు (చంద్రబాబు, లోకేశ్) మాయం చేస్తారని పేర్కొన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నడిరోడ్డులో పెట్టారని మండిపడ్డారు. వందగొడ్లను తిన్న ఒక్క రాబందు ఒక్క గాలివానకు పోయినట్టు చంద్రబాబుకు కూడా అదే గతి పడుతుందన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad