ఈ వేసవిలో విడుదల కానున్న భారీ చిత్రాలివే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, March 06, 2019

ఈ వేసవిలో విడుదల కానున్న భారీ చిత్రాలివే..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆదుకునేది ఏడాదిలో రెండే రెండు సీజన్లు. అందులో ఒకటి సంక్రాంతి సీజన్ కాగా, రెండోది వేసవి సీజన్. ఇందులో ముఖ్యమైంది వేసవి సీజన్. ఈ సీజన్ పైనే టాలీవుడ్ ఎక్కువగా గురిపెడుతోంది. కళాళాలలు, స్కూళ్లకు దాదాపు 50 రోజులు సెలవులు ఉంటాయి. దీంతో బడా హీరోలు, చిన్న హీరోలు కూడా వేసవిని టార్గెట్ గా చేసుకునే తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు.

కాగా, ఈ వేసవిలోనూ బడా హీరోల చిత్రాలతోపాటు చిన్న హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో ముందుగా ఏప్రిల్ 5న రియల్ కపుల్ అయిన అక్కినేని నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన 'మజిలీ' చిత్రం విడుదల కానుంది. నానితో 'నిన్నుకోరి' వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మజిలీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏమాయ చేశావే తర్వాత చాలాకాలానికి సమంత, నాగచైతన్య కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక మజిలీ విడుదలైన వారం రోజులకు అంటే ఏప్రిల్ 12న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా వస్తున్న 'చిత్రలహరి' విడుదల కానుంది. 'నేను శైలజ' వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన తిరుమల కిశోర్ దీనికి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చిత్రలహరి విడుదలయిన వారం రోజులకు అంటే ఏప్రిల్ 19న నాని హీరోగా వస్తున్న 'జెర్సీ' మూవీ వస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు.

ఏప్రిల్ లో మూడు చిత్రాలు వస్తుండగా మే నెలలో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. మే 9న ప్రిన్స్ మహేశ్ బాబు 'మహర్షి' చిత్రం విడుదలవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ లు నిర్మించారు. ఇక మే నెలలో చివరిగా అంటే మే 23న శర్వానంద్ హీరోగా నటించిన 27వ చిత్రం విడుదలవుతుంది. మరికొద్దిరోజుల్లో ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నారు. సంక్రాంతి సీజన్ టాలీవుడ్ ను నిరాశపరిచిన నేపథ్యంలో వేసవి సీజన్ అయినా టాలీవుడ్ కు కలిసి వస్తుందో, లేదో వేచిచూడాలి. 

No comments:

Post a Comment

Post Bottom Ad