టీడీపీ తరఫున మహేశ్ బాబు ప్రచారం చేయనున్నాడా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 07, 2019

టీడీపీ తరఫున మహేశ్ బాబు ప్రచారం చేయనున్నాడా?

వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రిన్స్ మహేశ్ బాబు ప్రచారం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మహేశ్ కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు టీడీపీలో ఉండటమే దీనికి కారణం. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా మహేశ్ బాబు సోదరి భర్త గల్లా జయదేవ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే సీటు ఖరారైంది. అదేవిధంగా మహేశ్ బాబు బాబాయి, హీరో కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేశ్ బాబును ప్రచారంలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు గల్లా జయదేవ్ ద్వారా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం, క్షేత్ర స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు భారీగా పెరిగిపోయిన అవినీతి, అదుపుతప్పిన శాంతిభద్రతలు తదితర కారణాలతో ప్రజలు వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో తమను అధికారంలోకి తెచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో లేకపోవడంతో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఆ పార్టీ తురుపుముక్క జూనియర్ ఎన్టీఆర్ మరోమారు టీడీపీకి ప్రచారం చేసే ఉద్దేశంతో లేరు. తనను అన్ని రకాలుగా అణగదొక్కడానికి చంద్రబాబు ప్రయత్నించిన తీరు, లోకేశ్ ను భావి సీఎంగా చేయడం కోసం తనను వాడుకుని వదిలేశారనే భావన ఎన్టీఆర్ లో భారీగా గూడుకట్టుకుని ఉంది. తన అల్లుడుకు ప్రాధాన్యం దక్కకపోవడంపై జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కొద్ది రోజుల కిందట వైఎస్సార్సీపీలో చేరారు. ఇక గ్లామర్ పరంగా పార్టీకి దిక్కుగా ఉన్న నందమూరి బాలకృష్ణ వాగ్ధాటిగా ప్రసంగాలు చేయలేరు. పైగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ హిందూపురం నుంచి పోటీ చేస్తే ఆయన ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేశ్ బాబును దించాలని టీడీపీ భావిస్తోంది. రాజకీయాలంటే ఏ మాత్రం గిట్టని మహేశ్ బాబు దీనికి ఎంతవరకు అంగీకరిస్తాడో వేచిచూడాల్సిందే..!

No comments:

Post a Comment

Post Bottom Ad