ధోనికి మాత్రమే దక్కిన అరుదైన రికార్డు ఇదే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, March 06, 2019

ధోనికి మాత్రమే దక్కిన అరుదైన రికార్డు ఇదే

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఎన్నో రికార్డులకు వేదికవుతోంది. తాజాగా నాగపూర్ లో జరిగిన రెండో వన్డేలో భారత డాషింగ్ బ్యాట్సమన్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచులో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా భారత్ 500 వన్డే మ్యాచులు గెలిచిన రెండో జట్టుగా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచులో భాగమైన ధోని భారత్ విజయం సాధించిన 300 వన్డేలోనూ, 400 వన్డేలోనూ ఆడాడు. ఆ మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం. ఇలా భారత్ ఆడిన 300, 400, 500 వన్డే మ్యాచుల్లో విజయం సాధించిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అత్యధిక సిక్సులు బాది భారత్ తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు తన పేర లిఖించుకున్నాడు. ధోని ఖాతాలో మొత్తం 216 సిక్సులు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఖాతాలో 215 సిక్సర్లు ఉన్నాయి.

అదేవిధంగా లిస్ట్- ఎ క్రికెట్ లో 13,000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగానూ ధోని రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ల పేరిట ఉండగా తాజాగా ధోని కూడా వారి సరసన చేరాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad