మ్యాగజైన్ కవర్ పేజ్ పై దుమ్ములేపిన 'గీత మేడమ్' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 05, 2019

మ్యాగజైన్ కవర్ పేజ్ పై దుమ్ములేపిన 'గీత మేడమ్'

తెలుగులో నాగశౌర్య నిర్మించి హీరోగా నటించిన 'ఛలో' చిత్రంతో ఆరంగేట్రం చేసింది.. శాండల్ వుడ్ అందం.. రష్మిక మందన. ఛలో సినిమాలో రష్మిక డ్రస్సింగ్ స్టయిల్ కు, అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ నయా స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'గీతగోవిందం' భారీ విజయం సాధించి రష్మికను ఎక్కడకో తీసుకుపోయింది. ఇందులో గీతగా అద్భుత నటనను ప్రదర్శించి రష్మిక మంచిపేరు తెచ్చుకుంది.

వాస్తవానికి.. శాండల్ వుడ్ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న ఈ 22 ఏళ్ల చిన్నది గీతగోవిందం హిట్ తో భారీ అవకాశాలు రావడంతో రక్షిత్ శెట్టికి గుడ్ బై చెప్పేసింది. విజయ్ దేవరకొండతో ప్రేమలో పడటమే దీనికి కారణమని, విజయ్ ఈ చిన్నదాన్ని తాను నటించే చిత్రాల్లో పెట్టుకోవాలని రికమండ్ చేస్తున్నాడని వార్తలు కూడా షికారు చేశాయి. అయితే వాటిని ఈ ఇద్దరూ ఖండించకపోవడం గమనార్హం.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతోనే 'డియర్ కామ్రేడ్' చిత్రం చేస్తోంది. గతేడాది చివరలో వచ్చిన 'దేవదాస్' చిత్రం రష్మికను నిరాశపరిచింది. డియర్ కామ్రేడ్ తోపాటు, తెలుగులో భీష్మ, మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ప్రొవోక్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన పోజు కుర్రకారు గుండెలను లయ  తప్పేలా చేస్తోంది. మార్చి నెల సంచిక కోసం రష్మిక ఇచ్చిన పోజు అదరగొడుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad