వన్డేల్లో 500 విజయాలు సాధించిన మొదటి టీమ్ ఏదంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 05, 2019

వన్డేల్లో 500 విజయాలు సాధించిన మొదటి టీమ్ ఏదంటే..

భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మార్చి 5న నాగ్ పూర్ లో జరిగిన రెండో వన్డే భారత్ కు మధుర స్మృతులు మిగిల్చింది. ఈ వన్డేలో విజయం సాధించిన భారత్ వన్డేల్లో 500 విజయాలు సాధించిన రెండో జట్టుగా రికార్డుకెక్కింది. భారత్ ఇప్పటివరకు మొత్తం 963 వన్డేలు ఆడి 500 విజయాలు సాధించింది. 414 మ్యాచులు ఓడిపోయింది. మిగిలిన మ్యాచులు రద్దవడం, డ్రా అవ్వడం జరిగాయి.

కాగా, వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం 924 వన్డేలు ఆడి 558 విజయాలు సాధించింది. 323 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, ఇండియా తర్వాత స్థానంలో మన ప్రత్యర్థి పాకిస్థాన్ ఉంది. పాక్ ఇప్పటివరకు మొత్తం 907 వన్డేలు ఆడి 479 మ్యాచుల్లో విజయం సాధించింది. 401 మ్యాచుల్లో ఓడిపోయింది.

ఇదిలా ఉండగా నాగపూర్ లో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతోపాటు, వన్డేల్లో 40వ సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్లలో కేవలం 159 ఇన్నింగ్స్ ల్లోనే 9 వేల పరుగుల మైలురాయిని చేరుకుని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ (203 ఇన్నింగ్స్ లు) రికార్డును బద్దలు కొట్టాడు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని 253 ఇన్నింగ్స్ ల్లో 9 వేల పరుగులు చేశాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad