ప్రేమకథా చిత్రమ్ -2 పోస్టర్ అదిరిపోయిందిగా..! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 05, 2019

ప్రేమకథా చిత్రమ్ -2 పోస్టర్ అదిరిపోయిందిగా..!

హర్రర్ కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన 'ప్రేమకథా చిత్రమ్' ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. దాసరి మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్ బాబు, నందిత హీరోహీరోయిన్లుగా సప్తగిరి, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం స్ఫూర్తితో మరెన్నో హర్రర్ కామెడీ చిత్రాలు తెలుగులో వచ్చాయి.

ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి, నవ్వించడానికి ప్రేమకథా చిత్రమ్ -2 మూవీ వస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లుగా సుమంత్ అశ్విన్, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్న నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి నిర్మాణంలో హరికిషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. 2013లో వచ్చి విజయం సాధించిన ప్రేమకథా చిత్రమ్ మాదిరిగానే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. చీరకట్టులో నందిత శ్వేత భయంకరంగా చూస్తున్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి రిలీజయ్యాక ఈ చిత్రం మరెన్నిసంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాలి. 

No comments:

Post a Comment

Post Bottom Ad