దర్శకుడు సుకుమార్ తో విభేదాలు నిజమే: ఒప్పుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 05, 2019

దర్శకుడు సుకుమార్ తో విభేదాలు నిజమే: ఒప్పుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తో విబేధాలు నిజమేనని ప్రిన్స్ మహేశ్ బాబు ఒప్పుకున్నాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. గతేడాది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన సుకుమార్ ఆ చిత్రం తర్వాత మహేశ్ బాబుతో సినిమా తీయాల్సి ఉంది. మహేశ్ బాబుకు కథ వినిపించగా తనకు నచ్చలేదని, మార్పులు చేయాలని సూచించినట్టు సమాచారం. మళ్లీ కథను మార్చి చెప్పినప్పటికీ మహేశ్ కు నచ్చలేదు. అంతేకాకుండా ఈ ఏడాది 'ఎఫ్2'తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం.

దీంతో హర్టయిన సుకుమార్.. మహేశ్ బాబుకు చెప్పిన కథను మెగా హీరో అల్లు అర్జున్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. దీనిపై ట్విటర్ లో వివరణ ఇచ్చిన మహేశ్.. దర్శకుడు సుకుమార్ తో కథాపరమైన విభేదాలు నిజమేనని స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ తో కొత్త ప్రాజెక్టును ప్రకటించినందుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అంతేకాకుండా సుకుమార్ ను తాను గౌరవిస్తానని, '1నేనొక్కడినే' సినిమా షూటింగ్ లో ప్రతి నిమిషం సుకుమార్ తో కలసి పనిచేయడాన్ని గౌరవంగా భావించానని తెలిపాడు.

కాగా, ప్రస్తుతం మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. ఇది ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ నటించనున్నాడు. మరోవైపు సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పూర్తయ్యాక రంగంలోకి దిగనున్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad