వావ్ కవర్ పేజీపై అదరగొట్టిన అందాల భామ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 05, 2019

వావ్ కవర్ పేజీపై అదరగొట్టిన అందాల భామ

గతేడాది అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచిలో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది.. అందాల భామ.. నిధి అగర్వాల్. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పరాజయం పాలై అమ్మడిని నిరాశపరిచింది. ఈ ఏడాది మరో అక్కినేని కుటుంబ హీరో అఖిల్ తో మిస్టర్ మజ్నులో అవకాశం దక్కించుకున్నప్పటికీ ఈ సినిమా కూడా విజయం సాధించలేదు.

అయితే.. మంచి ఒంపుసొంపులు, ఎక్సపోజింగ్ కు ఏ మాత్రం మోహమాటపడకపోవడం వంటి కారణాలతో ఈ భామ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. దీంతోపాటు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోతున్న బాలీవుడ్ చిత్రంలో లీడ్ రోల్ చేయనుంది. తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ 'కత్తి' రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అక్షయ్ సరసన ఆడిపాడనుంది.

కాగా, ఈ ముద్దుగుమ్మ మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'వావ్' మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఇచ్చిన లుక్ కుర్రకారు మతులు పోగొడుతోంది. తన ఎద అందాలను యథేచ్చగా ప్రదర్శిస్తూ నిధి ఇచ్చిన పోజు యువత గుండెలను గాయబ్ చేస్తోంది. వావ్ మార్చి నెల సంచిక కోసం ఇచ్చిన పోజు చూస్తుంటే ఈ భామ అందాల 'నిధి' అందరూ ఒప్పుకోవాల్సిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad