నాతో పెట్టుకోవడం వల్లే ఆయన ముక్కలు ముక్కలై పోయాడు: కేఏ పాల్ దారుణ వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 05, 2019

నాతో పెట్టుకోవడం వల్లే ఆయన ముక్కలు ముక్కలై పోయాడు: కేఏ పాల్ దారుణ వ్యాఖ్యలు

ప్రముఖ క్రైస్తవ బోధకుడు కేఏ పాల్ ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ టీవీ, యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచేది ప్రజాశాంతి పార్టీయేనని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.

తనతో పెట్టుకోవడం వల్లే దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముక్కలు ముక్కలై పోయాడని పాల్ దారుణ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారుణ ఓటమి తప్పదని, ఆయనకు డిపాజిట్లు కూడా రావని కేఎల్ పాల్ తేల్చిచెప్పారు. మరణించిన వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్ అభిమానులు కేఏ పాల్ పై మండిపడుతున్నారు. వాస్తవానికి.. వైఎస్సార్సీపీకి పెట్టని కోటగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, బడుగు, బలహీనవర్గాలవారి ఓట్లను చీల్చడానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కేఏ పాల్ తో పార్టీ పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా కేఏ పాల్ తన పార్టీ గుర్తుగా హెలికాప్టర్ ను పెట్టుకున్నారు. ఇప్పుడు దీనిపైనా వివాదమవుతోంది. హెలికాప్టర్ పై ఉన్న ఫ్యాన్ గుర్తులు.. వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తు ప్యాన్ ను పోలి ఉండటంతో దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చదువుకోనివారి, గ్రామీణులు ఓటు వేసేటప్పుడు గుర్తుల విషయంలో మోసపోయే ప్రమాదముందని అంటున్నారు. ఓటు వేసేటప్పుడు పొరపాటున ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ కు ఓటు వేసే అవకాశముందని భయపడుతున్నారు. న్యాయస్థానంలో కేసు దాఖలు చేయడంతోపాటు ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరడానికి వైఎస్సార్సీపీ నేతలు ఉద్యుక్తులవుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad