పవన్ కల్యాణ్ సభలకు వచ్చే వారంతా ఓట్లు వేసేవారేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, March 05, 2019

పవన్ కల్యాణ్ సభలకు వచ్చే వారంతా ఓట్లు వేసేవారేనా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాన పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతోపాటు విద్యార్థులు, రైతులు, మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి వారు వీరు అనే తేడా లేకుండా ప్రజలు పోటెత్తుతున్నారు. జనసేన పార్టీ అంత బలంగా ఉండదనుకున్న రాయలసీమలోనూ పవన్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దీనిపై జనసేన పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం పవన్ ఎవరి పుట్టి ముంచుతాడో తెలియక తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.

అయితే.. పవన్ కు అఖండ ప్రజాదరణ లభిస్తున్నప్పటికీ అవన్నీ ఓట్ల రూపంలో బదిలీ అయితేనే జనసేన పార్టీకి లాభం చేకూరుతుందని, లేదంటే ఎలాంటి ఫలితం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఇంతకంటే ఎక్కువగా ఆయన సభలకు ప్రజలు వచ్చారని, అయితే ఓట్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదని గుర్తు చేస్తున్నారు. సభలకు హాజరవుతున్న జనాన్ని చూసుకుని వారంతా ఓట్లు వేస్తారని భావిస్తే పప్పులో కాలేసినట్టేనని అంటున్నారు.

సాధారణంగా పవన్ కల్యాణ్ లాంటి అగ్ర నటుడు తమ ప్రాంతానికి వస్తుంటే చూడటానికి వచ్చేవారి సంఖ్య భారీగానే ఉంటుందని, అలాగే మరికొంతమంది పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు? ఆయన పార్టీ విధి విధానాలు తెలుసుకోవడానికి ఇంకొంతమంది వస్తారని పేర్కొంటున్నారు. ప్రస్తుత రోజుల్లో చిన్నస్థాయి టీవీ యాంకర్లు, టీవీ నటులు ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్ కు వస్తే జనాలు భారీగా హాజరవుతున్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటిది పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ప్రజల స్పందన ఇంతకంటే అమోఘంగానే ఉంటుందని, అయితే వచ్చినవారంతా ఓట్లు వేయరని గుర్తుంచుకుంటే మేలని హెచ్చరిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad