34 ఏళ్ల నయనతారతో 29 ఏళ్ల విజయ్ దేవరకొండ రొమాన్స్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 03, 2019

34 ఏళ్ల నయనతారతో 29 ఏళ్ల విజయ్ దేవరకొండ రొమాన్స్

టాలీవుడ్ నయా స్టార్ విజయ్ దేవరకొండ తమిళంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'నోటా' చిత్రంతో గతేడాది తమిళంలో ఒక చిత్రం చేసిన విజయ్ ఈసారి లేడీ సూపర్ స్టార్, అందాల భామ నయనతారతో జతకట్టనున్నాడు. ఈ చిత్రం తమిళంతోపాటు, తెలుగులో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు నిర్మించే ఈ చిత్రానికి ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

తన కంటే వయసులో పెద్దదైన యువతితో ఒక యువకుడు ప్రేమలో పడటం, రొమాన్స్ చేయడం, వయసు పరంగా వారిద్దరి మధ్య వచ్చిన విబేధాలే ఈ చిత్ర కథాంశమని సమాచారం. ఇప్పటికే కథను నయనతార, విజయ్ దేవరకొండలకు వినిపించారని, ఈ చిత్రం చేయడానికి వారిద్దరూ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగులో 'డియర్ కామ్రేడ్' తోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో నటిస్తున్నాడు. అదేవిధంగా నయనతార.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా' చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది.

సైరాతోపాటు మరికొన్ని చిత్రాలు చేతిలో ఉన్న నయనతార, విజయ్ దేవరకొండలు తమ చిత్రాల షూటింగ్ లు పూర్తికాగానే ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. వాస్తవానికి వయసులో విజయ్ దేవరకొండ కంటే నయనతార ఐదేళ్లు పెద్దది. విజయ్ వయసు 29 ఏళ్లు కాగా, నయనతార వయసు 34 ఏళ్లు. వీరిద్దరి రొమాన్స్ తో తెరకెక్కే ఈ చిత్రం విడుదలయ్యాక మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad