నారా లోకేశ్ పోటీ చేస్తే ఆ మూడు జిల్లాలపై ప్రభావం ఉంటుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 01, 2019

నారా లోకేశ్ పోటీ చేస్తే ఆ మూడు జిల్లాలపై ప్రభావం ఉంటుందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో మంత్రి పదవిలో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇలా దొడ్డిదారిన మంత్రి అయ్యారని ప్రారంభంలోనే ప్రతిపక్ష పార్టీలు ఆయన్ను తీవ్రంగా విమర్శించాయి. పోటీ చేయడానికి తనకు నియోజకవర్గాలు ఖాళీ లేవని, తన కోసం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిని పక్కకు తప్పుకోమనడం ధర్మం కాదని లోకేశ్ అప్పట్లో సెలవిచ్చారు.

అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాత్రం లోకేశ్ పోటీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గుడివాడ, పెనమలూరు, చంద్రగిరి, కుప్పం, హిందూపురం వంటి నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి లోకేశ్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే గుడివాడలో కొడాలి నానిలాంటి అత్యంత బలమైన అభ్యర్థిని ఎదుర్కోవడం కష్టమనే భావనలో గుడివాడను తప్పించేశారు. ఇక కుప్పం నుంచి గెలిస్తే తండ్రి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడనే అపప్రధ వస్తుంది. ఇక చంద్రగిరిలో స్వయంగా సీఎం చంద్రబాబే ఒకసారి పరాజయం పాలయ్యారు. అంతేకాకుండా ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. దీంతో చంద్రగిరి నుంచి గెలవడం కష్టమని దాన్ని కూడా తప్పించారు. ఇక హిందూపురంలో లోకేశ్ మేనమామ నందమూరి బాలయ్య ఉన్నారు. గెలిచాక నియోజకవర్గం ఉండని బాలయ్యపై నియోజకవర్గ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడా కష్టమే.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా భీమిలిలో లోకేశ్ పోటీ చేస్తారని టీడీపీ ఆస్థాన పత్రిక ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. భీమిలిని తన శాఖ ద్వారా లోకేశ్ చాలా అభివృద్ధి చేశారని, భారీ ఎత్తున పెట్టబడులు వచ్చాయని, పలు ప్రముఖ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేశారని ఇలా పలు సోత్ర పాఠాలతో ఆ కథనం సాగింది. అంతేకాకుండా నారా లోకేశ్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపైన ఉంటుందని రాసుకొచ్చింది. తన తాత ఎన్టీఆర్ గెలిచిన గుడివాడ నుంచి, తన తండ్రి సొంత జిల్లా చిత్తూరు నుంచి పోటీ చేసే ధైర్యం లేని లోకేశ్ భీమిలి నుంచి గెలుస్తాడని అనడంపై ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. పైగా ఆయన పోటీ మూడు జిల్లాలపై ప్రభావం చూపుతుందనడంపై సెటైర్లు పేలుతున్నాయి.

వాస్తవానికి రాష్ట్రంలో విశాఖ జిల్లా ఒక్కదానిలోనే లక్షలాది ఎకరాల భూములను టీడీపీ నేతలు మాయం చేశారు. వీటి విలువ  లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని పలువురు నిపుణులు, మేధావులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇక ప్రతిపక్ష పార్టీల పోరాటం సరేసరి. స్వయంగా విశాఖ జిల్లా టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ పార్టీ నేతలే విశాఖను దోచుకున్నారని, ఇందులో ప్రధాన పాత్ర మరో మంత్రి గంటా శ్రీనివాసరావుదేనని చెప్పి కలకలం సృష్టించారు. భూముల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా సిట్ వేసింది. అందులోనూ ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో లోకేశ్ కులమైన కమ్మ సామాజికవర్గం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే స్థాయిలో కూడా లేదు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తాడననడంపై భారీగా సెటైర్లు పేలుతున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad