'సాక్షి పత్రిక'పై ఇంత వివక్ష ఎందుకు చంద్రబాబు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 01, 2019

'సాక్షి పత్రిక'పై ఇంత వివక్ష ఎందుకు చంద్రబాబు?

అధికారంలో ఉన్న పార్టీలు తమకు నచ్చని పత్రికలు, టీవీ చానెళ్లపై దాడి చేయడం ఈనాటిది కాదు. ఇది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలం నుంచి వస్తున్నదే. 1970-77 మధ్య కాలంలో తన భజన చేయని పత్రికలపై అనేక ఆంక్షలు విధించి వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు... ఇందిర. మన రాష్ట్రం విషయానికొస్తే 'ఉదయం' దినపత్రిక తమకు పోటీగా ఎదుగుతోందని, దానివల్ల తమకు ముప్పుతప్పదని గ్రహించిన ఈనాడు పత్రిక 1994లో ఎన్టీఆర్ సీఎంగానే మద్యనిషేధ ప్రకటన చేయించి ఉదయం పత్రిక ఆర్థిక మూలాలను దెబ్బకొట్టిందనే విమర్శలున్నాయి.

అదేవిధంగా ఇప్పుడు ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలా నిలబడుతోన్న సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఏ పత్రిక మనుగడ సాగించాలన్నా ప్రకటనలే కీలకం. ప్రైవేటు సంస్థలిచ్చే ప్రకటనలకంటే ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలే ఎక్కువ ఉంటాయి. ఈ ప్రకటనలను ఆయా పత్రికల సర్క్యులేషన్స్ ప్రకారం ఇస్తుంటారు. వాస్తవానికి సర్క్యులేషన్ ప్రకారం సాక్షి దినపత్రిక రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. అయితే సాక్షి కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతికి.. సాక్షి రెట్టింపు మొత్తంలో ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం ఆ మేర సాక్షిపై మాత్రం తీవ్ర వివక్ష చూపింది.

తన ఆస్థాన దినపత్రికలు, తమ కమ్మ సామాజికవర్గానికి చెందిన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే వందల కోట్ల రూపాయలు ప్రకటనలను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. 2014లో టీడీపీ గెలుపొందింది మొదలు ఈ ఐదేళ్లలోనూ సాక్షిపై వివక్ష నడుస్తూనే ఉంది. ఆ రెండు పత్రికలకు ఇచ్చిన మొత్తంలో సగం కూడా సాక్షికి ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత వివక్ష ప్రదర్శించిందో తెలుస్తోంది. 2015-16లో ఈనాడుకు రూ.9.04 కోట్లు, ఆంధ్రజ్యోతికి రూ.5.73 కోట్లు ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం సాక్షికి రూ.2.53 కోట్లు మాత్రమే ఇచ్చింది. అదేవిధంగా 2016-17లో ఈనాడుకు రూ.7.37 కోట్లు, ఆంధ్రజ్యోతికి రూ.5.27 కోట్లు ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం సాక్షికి రూ.2.40 కోట్లు మాత్రమే ఇచ్చింది. అదేవిధంగా 2017-18లో ఈనాడుకు రూ.16.64 కోట్లు, ఆంధ్రజ్యోతికి రూ.10.99 కోట్లు ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం సాక్షికి రూ.8.99 కోట్లు మాత్రమే ఇచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad