కమ్మ నేతల చేరికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, February 28, 2019

కమ్మ నేతల చేరికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా?

ఆయా పార్టీల నుంచి చేరేవారితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. ఒక పక్క ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాసరావు వంటి కాపు నేతలు; మరోపక్క దాసరి జైరమేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ వంటి కమ్మ సామాజికవర్గ నేతలతో బలం పుంజుకుంటోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం ఈ జోష్ రెట్టింపైంది.

దీంతో రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజికవర్గాలైన కాపు, కమ్మ నేతల చేరికలతో వైఎస్సార్సీపీ బలం పుంజుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమ కమ్మ సామాజికవర్గం నేతలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధికార టీడీపీలో నైరాశ్యం అలుముకుంది. తాము ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ప్రజల్లో అనుకున్నంత బూస్ట్ రాలేదనే చర్చ టీడీపీలో జరుగుతోంది. పులి మీద పుట్రలా సొంత కులస్తులే ప్రతిపక్ష పార్టీలో చేరుతుండటంతో టీడీపీ నేతలు తీవ్ర అంతర్మథనం చెందుతున్నారు.

సాక్షాత్తూ చంద్రబాబు సొంత మీడియాగా అందరూ చెప్పుకునే ఆంధ్రజ్యోతి దినపత్రికలో దాని ఎండీ రాధాకృష్ణ దీనిపై పెద్ద వ్యాసమే రాశారు. చంద్రబాబును ఓడించడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేయాల్సిందంతా చేస్తున్నారని, చంద్రబాబు మీద అసూయతో, కక్షతో ఆయన రగిలిపోతున్నారని ఒక కథనం వండివార్చారు. కమ్మ సామాజికవర్గ నేతలతో మాట్లాడటం, వారిని వైఎస్సార్సీపీలో చేర్పించడం దగ్గుబాటే చేస్తున్నారని ఆ కథనంలో తన ఏడుపునంతా వెళ్లగక్కారు. వీరే కాకుండా మరికొంతమంది నేతలు కూడా వైఎస్సార్సీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తుండటం టీడీపీని కలవరపెడుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad