తన భార్య మాజీ ప్రేమికులను గౌరవిస్తున్న ప్రియాంకా భర్త - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 07, 2019

తన భార్య మాజీ ప్రేమికులను గౌరవిస్తున్న ప్రియాంకా భర్త

మిస్ వరల్డ్ గా ఎంపికై భారతీయ మహిళల అందాల గురించి అందరూ చెప్పుకునేలా చేసిన ప్రియాంకా చోప్రా ఆ తర్వాత బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఘనత సాధించడంతోపాటు హాలీవుడ్ మూవీస్ లోనూ, టీవీ సిరీస్ ల్లోనూ తన సత్తా చాటుతోంది. ఈ భామ గతేడాది తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా.. ప్రియాంకా చోప్రా, మరో బాలీవుడ్ హాట్ భామ కరీనా కపూర్ ఇద్దరూ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్
ఒక టీవీ చానెళ్లో నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షో అనేక ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఈ ఇద్దరు భామామణులు గతంలో ఒకే ప్రియుడితో డేటింగ్ చేశారు. షాహిద్ కపూర్ తో వేర్వేరు కాలాల్లో ప్రేమాయణం నడిపారు. చాలా జంటల మాదిరిగానే వీరి ప్రేమ పట్టాలెక్కలేదు. కరీనా షాహిద్ కపూర్ తో విడిపోయాక సైఫ్ అలీఖాన్ తో డేటింగ్ చేసి అతడిని పెళ్లి చేసుకోగా, ప్రియాంక చోప్రా కూడా గతేడాది నిక్ ను పెళ్లి చేసుకుంది. షాహిద్ కపూర్ తన చిన్ననాటి స్నేహితురాలు మీరాను వివాహమాడాడు. షాహిద్ తో విడిపోయాక కొంతకాలం హర్మన్ బవేజాతోనూ ప్రియాంక డేటింగ్ చేసింది.

టీవీ షోలో భాగంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు సమాదానం ఇచ్చి న ప్రియాంకా తన మాజీ ప్రియుళ్లు, తన భర్త ప్రియురాళ్ల గురించి అనేక సంగతులు పంచుకుంది. నిక్ జోనాస్ కు తన మాజీ ప్రియుళ్ల గురించి తెలుసని చెప్పింది. అతడు వారిని గౌరవిస్తాడని వెల్లడించింది. అదేవిధంగా నిక్ జోనాస్ మాజీ ప్రియురాళ్ల గురించి కూడా తనకు తెలుసని, వారితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పింది. మొత్తానికి భార్యాభర్తలంటే నిక్ జోనాస్, ప్రియాంక చోప్రాల్లా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad