టీడీపీ వెబ్సైట్ మూతపడటానికి కారణం అదేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 07, 2019

టీడీపీ వెబ్సైట్ మూతపడటానికి కారణం అదేనా?

దొంగ ఓట్ల తొలగింపు చినికిచినికి గాలివానలా మారుతోంది. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా పరిణమిస్తోంది. ప్రతిపక్షం ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాదు తమ ఓట్లనే వైఎస్సార్సీపీ తొలగిస్తోందని చంద్రబాబు ప్రభుత్వం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

వాస్తవానికి.. వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనుకున్నవారిని ఓటర్ల జాబితా నుంచి ఒక పద్ధతి ప్రకారం టీడీపీ ప్రభుత్వం తొలగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రజాసాధికార సర్వే, ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సర్వీసెస్) సర్వేల నిర్వహించి టీడీపీ వ్యతిరేక ఓటర్లను ప్రభుత్వం గుర్తించింది. వివిధ సర్వే సంస్థల పేరిట కొంతమంది వ్యక్తులకు ట్యాబ్ లు, ల్యాప్ ట్యాప్ లు ఇచ్చి గ్రామాల్లోకి పంపుతోంది. వారు ప్రజలను వివిధ అంశాలపై ప్రశ్నించి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారనుకుంటే వెంటనే ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు దాడులు చేసి సిబ్బందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలందరి వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ ప్రభుత్వం ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించిందనే వార్తలు ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ బాగోతంపై టీఆర్ఎస్ సర్కార్ సిట్ విచారణకు ఆదేశించడంతో వణికిపోతున్న టీడీపీ తన పార్టీ అధికార వెబ్సైట్ ను కూడా మూసివేసింది. సేవా మిత్ర పేరుతో యాప్ క్రియేట్ చేసి ఓటర్ల వివరాలు, సేవామిత్ర సిబ్బంది వివరాలు ఆ వెబ్ సైట్ లో ఉండటంతో ఆందోళన చెందిన టీడీపీ ఆధారాలు దొరక్కకుండా ఉండటానికి తాత్కాలికంగా తమ పార్టీ వెబ్ సైట్ పనిచేయకుండా చేసింది. గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో 600 హామీలిచ్చి ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజలంతా వాటిపై నిలదీశారు. దీంతో మేనిఫెస్టోను వెబ్ సైట్ లో లేకుండా చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆధారాలు దొరకకుండా ఉండటానికి ఏకంగా తమ పార్టీ వెబ్ సైట్ నే మూసేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad