వైఎస్సార్సీపీకి సినీ గ్లామర్ విజయం సాధించిపెట్టేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 07, 2019

వైఎస్సార్సీపీకి సినీ గ్లామర్ విజయం సాధించిపెట్టేనా?

వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలోకి అధికార తెలుగుదేశం నుంచి భారీ ఎత్తున చేరుతున్నారు. సీట్లు రావనుకున్నవారే కాకుండా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

మరోవైపు రాజకీయ నాయకులే కాకుండా సినీ రంగం నుంచి కూడా వైఎస్ జగన్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి, హాస్య నటుడు పృథ్వీ, వెటరన్ నటుడు విజయ్ చందర్, ఒకప్పటి స్టార్ హీరో భానుచందర్ వంటివారు వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల ప్రముఖ సినీ నటుడు నాగార్జున.. వైఎస్ జగన్ ను కలిసి తన మద్దతు తెలిపారు. తాజాగా సహజనటిగా అభిమానుల హృదయాలను దోచుకున్న జయసుధ కూడా వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే ఒకప్పటి హీరోయిన్ ఆర్కే రోజా వైఎస్సార్సీపీ తరఫున చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో సినీ గ్లామర్ తో ఆ పార్టీ కళకళలాడుతోంది.

అయితే.. వీరిలో పోటీ చేసేవారి పేర్లలో రోజా, జయసుధ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. నగరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా మరోమారు పోటీ చేస్తుండగా, తాజాగా పార్టీలో చేరిన జయసుధ రాజమండ్రి ఎంపీ స్థానం లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ లాంటి అతిపెద్ద ఇమేజ్, గ్లామర్ ఉన్న నటుడి ముందు ఈ నటుల గ్లామర్ సరిపోతుందా అనే సందేహాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad