మరోమారు 'తూర్పు'లో పవన్ హోరు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 07, 2019

మరోమారు 'తూర్పు'లో పవన్ హోరు

మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాను టార్గెట్ చేయనున్నారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో జరపనున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రజల మధ్య భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మొదట విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ అత్యధిక అసెంబ్లీ స్థానాలు (19) ఉన్న తూర్పుగోదావరి జిల్లా అయితే బాగుంటుందని రాజమహేంద్రవరాన్ని ఖరారు చేశారు.

ఈ సభలో ఎన్నికల మేనిపెస్టోను ప్రకటించడంతోపాటు కొన్ని నియోజకవర్గాలకు పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ ప్రభావం అత్యంత బలంగా ఉంటుందనుకుంటున్న జిల్లాల్లో తూర్పుగోదావరి ఒకటి. పోటీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా ఎక్కువగా ఇదే జిల్లా నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్.. రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

సభ నాటికి ఎన్నికల షెడ్యూలు కూడా వస్తుంది కాబట్టి ఇక అక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరోమారు పర్యటించి పవన్ జోష్ నింపనున్నారు. ఈ ఐదు జిల్లాల్లో ఉన్న 68 సీట్లలో అత్యధికంగా సీట్లను కొల్లగొట్టడానికి పవన్ ఇప్పటికే తనదైన వ్యూహాలు సిద్ధం చేశారు. పోటీ చేసే అభ్యర్థుల్లో కూడా అటు మాజీ ఎమ్మెల్యేలు, ఇటు వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి పవన్ కల్యాణ్ పై కేంద్రీకృతమైంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad