వైఎస్సార్సీపీలో ఆ నలుగురిని చూసి చంద్రబాబు భయపడుతున్నారా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 08, 2019

వైఎస్సార్సీపీలో ఆ నలుగురిని చూసి చంద్రబాబు భయపడుతున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నలుగురు నేతలను చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భయపడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ నలుగురు నేతలు శాసనసభలో తమకు కొరకరాని కొయ్యలుగా తయారవడంతో తట్టుకోలేక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నలుగురిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు.

వైఎస్సార్సీపీ తరఫున ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాని నానిలను వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇటు శాసనసభలోనూ, అటు బయట తమ పార్టీని ఈ నలుగురు ఇరకాటంలో పెడుతున్నారని, అందువల్ల ఈసారి ఈ నలుగురిని వచ్చే శాసనసభకు రాకుండా చూడాలని నిశ్చయించారు.

ఈ నలుగురిని ఓడించడం కోసం వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో ముగ్గురు సీనియర్లతో కూడిన కమిటీని వేయడం, భారీ ఎత్తున డబ్బు పంపడం, మద్యం పంపిణీ వంటివి చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబు టీడీపీ నేతలను పిలిచి నియోజకవర్గాలవారీగా బాధ్యతలు కూడా అప్పగించేసినట్టు సమాచారం. మరోవైపు వైఎస్సార్సీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వైఎస్ జగన్ కున్న ప్రజాదరణతో సులువుగా గెలుస్తామని ఢంకా బజాయించి చెబుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad