నందమూరి బాలకృష్ణ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాదెండ్ల - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, February 28, 2019

నందమూరి బాలకృష్ణ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాదెండ్ల

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ పెళ్లి కుదిర్చింది తానేనని చెప్పారు. ఈ మేరకు ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బాలకృష్ణ దేన్నో ప్రేమించాడని, దాన్నే పెళ్లిచేసుకుంటానని అంటున్నాడని ఎన్టీఆర్ తనతో చెప్పి మంచి సంబంధం ఉంటే చూడాలని కోరారని నాదెండ్ల వెల్లడించారు. దీంతో తాను కాకినాడలో ఉన్న తమ బంధువుల ద్వారా వసుంధర ను చూపిస్తే మొదట్లో ఎన్టీ రామారావుకు నచ్చలేదని వివరించారు.

వసుంధర కుటుంబం కట్నం కింద పది లక్షలు ఇస్తే ఆ డబ్బులు మొత్తం తీసుకున్నాక ఎన్టీఆర్ పెళ్లికి ఒప్పుకున్నారని ఆనాటి సంగతులను నాదెండ్ల భాస్కరరావు గుర్తు చేసుకున్నారు. అయితే పెళ్లికి కూడా ఎన్టీఆర్ రాలేదని చెప్పారు. కాకినాడలోనే పెళ్లి జరిగందని, అప్పుడు తాను, ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నామని తెలిపారు. తండ్రివి దగ్గరుండి పెళ్లి జరిపించాలని తాను కోరితే నేను చూడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ అన్నారని నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా ఎన్టీఆర్ ప్రచారం కోసం చేసిందేనని ఎద్దేవా చేశారు. కుమారుడి పెళ్లికి కూడా వెళ్లకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి తాను తిరుగుతున్నానని చెప్పుకోవడం కోసమే ఎన్టీఆర్ ఇలా చేశారని నాదెండ్ల ఆనాటి సంగతులను వివరించారు. ఎన్టీఆర్ ఏది చేసినా ఆయన స్వప్రయోజనాల కోసమే చేస్తారని, ఇవన్నీ తెలియని జనాలు ఆయన్ను చాలా గొప్ప వ్యక్తిగా ఊహించుకున్నారని నాదెండ్ల తీవ్ర విమర్శలు చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad