దండుపాళ్యం సినిమా ప్రేరణతో 16 అత్యాచారాలు చేసిన సైకో. ఎక్కడంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, February 28, 2019

దండుపాళ్యం సినిమా ప్రేరణతో 16 అత్యాచారాలు చేసిన సైకో. ఎక్కడంటే..

దండుపాళ్యం సినిమా ప్రేరణతో 16 అత్యాచారాలు, నాలుగు హత్యలు చేశాడు.. ఒక సైకో కిల్లర్. ఇది ఎక్కడో కాదు ప్రశాంతతకు నెలవైన పశ్చిమగోదావరి జిల్లాలోనే కావడం గమనార్హం. కొద్దిరోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లాలోని గుంటుపల్లి బౌద్ధారామానికి వెళ్లిన ఒక ప్రేమజంటపై ఎవరో హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రేయసి మృతిచెందగా, ప్రియుడు చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును జిల్లా పోలీసులు తాజాగా ఛేదించారు. వివరాల్లోకెళ్తే..

కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రాలకు చెందిన పొట్లూరు రాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. జిల్లాలోని జి.కొత్తపల్లి మండలంలో నివాసం ఉంటూ పరిసర ప్రాంతాల్లోని జీడితోటలకు కాపలా కాసేవాడు. ఈ క్రమంలో పక్షులు, జంతువులను వేటాడి వధించేవాడు. ఎవరైనా ప్రేమ జంటలు కనిపిస్తే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకాకుండా ప్రియుడిని చితకబాది అతడి కళ్లముందే ప్రేయసి దారుణంగా అత్యాచారం చేసేవాడు. ప్రతిఘటిస్తే తీవ్రంగా హింసించేవాడు. ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో 16 అత్యాచారాలు చేసి సీరియల్ కిల్లర్ గా మారాడు. ఇందులో నలుగురిని దారుణంగా హతమార్చాడు.
అయితే ఇప్పటివరకు ఇతడిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

గత ఆదివారం గుంటుపల్లి బౌద్ధారామానికి వచ్చిన ప్రేమజంట ఏకాంతంగా కూర్చొని ఉండగా ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చిన సైకో కిల్లర్ రాజు.. యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి యువతిపై అత్యాచారం చేశాడు. ఆమె సహకరించకపోవడంతో కాళ్లు విరిచి మరీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి మరణించింది. సంఘటన జరిగాక అక్కడి నుంచి పరారయ్యాడు. యువకుడిని స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు.

కాగా, హత్య జరిగాక యువతి ఫోన్ ను తీసుకెళ్లిన హంతకుడు దానిలోని సిమ్ ను తీసి తన సిమ్ వేసుకున్నాడు. దీంతో పోలీసులు ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా నిందితుడి కదలికలను తెలుసుకుని అదుపులోకి విచారిస్తున్నారు. విచారణలో నిందితుడు ఇప్పటివరకు తాను 16 అత్యాచారాలు చేసినట్టు, వీరిలో నలుగురిని అంతమొందించినట్టు పేర్కొన్నాడు. దండుపాళ్యం సినిమా ప్రేరణతోనే తాను ఈ హత్యలు చేశానని అంగీకరించాడు.
No comments:

Post a Comment

Post Bottom Ad