విశాఖపట్నం నుంచి బాలకృష్ణ అల్లుడు గెలుస్తాడా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, February 27, 2019

విశాఖపట్నం నుంచి బాలకృష్ణ అల్లుడు గెలుస్తాడా?

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని భర్త శ్రీ భరత్ కు సీటు కన్ఫార్మ్ అయ్యింది. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే శ్రీ భరత్ గెలుపు అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ పాలనలో విశాఖలో జరిగిన భూకుంభకోణాలే దీనికి కారణమని పేర్కొంటున్నారు. భూకుంభకోణానికి సంబంధించి సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే మరో మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

భూరికార్డులు ట్యాంపరింగ్ జరిగాయని, లక్షలాది ఎకరాల భూములు అక్రమంగా తమ పేరిట టీడీపీ నేతలు రాయించుకున్నారని ప్రతిపక్షాలతోపాటు ప్రజలు, వివిధ రంగాల నిపుణులు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు భారీ ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో దిగివచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి తూతూమంత్రంగా విచారణ చేయించింది. సిట్ నివేదికను కూడా ఇప్పటివరకు భయపెట్టలేదు. దీంతో ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే భయపడుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ నేతలు కభ్జా చేసిన భూముల విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుందని నిపుణులు కూడా తేల్చారు. కేవలం విశాఖపట్నంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగానూ టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను చెరపట్టారనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ విశాఖపట్నం నుంచి గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భూకుంభకోణాలతోపాటు ఈసారి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అండదండలు టీడీపీకి లభించకపోవడం, బీజేపీని సమర్థించే ఉత్తరాది ఓటర్ల సంఖ్య విశాఖలో భారీగా ఉండటం, కమ్మ సామాజికవర్గం విశాఖ పార్లమెంటరీ పరిధిలో చాలా తక్కువగా ఉండటం వంటి కారణాలతో భరత్ కు శ్రీముఖం తప్పదని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. కాగా, గతంలో విశాఖపట్నం నుంచి భరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా గెలిచారు.

No comments:

Post a Comment

Post Bottom Ad